ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ నిష్క్రమించింది. అయినా ఆ జట్టు ఇంకా రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచుల ఫలితాలపైనే ఇతర జట్ల ప్లే ఆఫ్స్ ఆధారపడి ఉన్నాయి. అందుకే, హైదరాబాద్ ఆడే మ్యాచులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్ తన సొంత గడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఇవాళ తలపడుతుంది.