ఈసారి ఐపీఎల్ లో అనూహ్య ఫలితాలు కనిపిస్తున్నాయి. సీజన్లోకి ప్రవేశించిన జట్లు విలక్షణ ఫలితాలతో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఐపీఎల్ మొదలైన నాటి నుంచి ఏ సీజన్‌లో కూడా ఒక జట్టు తొలి 9 మ్యాచ్‌లలో 8 విజయాలు సాధించిన చరిత్ర లేదు. కానీ ఈసారి గుజరాత్ టైటాన్స్ తన సత్తా చాటింది. మరోసారి సమష్టి ప్రదర్శనతో చక్కటి ఆటతీరు కనబర్చిన గుజరాత్ వరుసగా ఐదో విజయాన్ని అందుకుని వాహ్ వా అనిపించింది. తొలి మూడు మ్యాచ్‌లు గెలిచాక…