పెళ్లిళ్లలో డబ్బు వృథా చేయడం పెద్ద విషయం కాదు కానీ.. పాకిస్థాన్‌లో ఓ పెళ్లిలో డబ్బులు వృథా చేసిన తీరుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఒక తండ్రి తన కొడుకు పెళ్లి కోసం విమానం బుక్ చేశాడు. ఈ విమానం వధువు ఇంటిపై డబ్బు వర్షం కురిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎగతాలి చేస్తున్నారు.