సోమవారం ఎన్నికల సంఘాన్ని పశ్చిమ బెంగాలు బీజేపీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా.. టీఎంసీ నేత పీయూష్ పాండాపై ఫిర్యాదు చేశారు. అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని, ప్రచారం చేయకుండా నిషేధించాలని ఎన్నికల కమిషన్‌ను బీజేపీ కోరింది. ఈ ఏడాది జనవరిలో ప్రధాని మోడీ అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించిన సమయంలో తన కులాన్ని ఉద్దేశించి పాండా వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో.. రోజు ఢిల్లీలో ఈసీని కలిసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.…