SVSN Varma: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. పిఠాపురంలో రాజకీయాలు చాలా విచిత్రంగా ఉన్నాయన్నారు.. గీత అక్కయ్య అమావాస్య పౌర్ణమికి కనిపిస్తూ.. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు అంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ వంగా గీతపై మండిపడ్డారు.. దమ్ముంటే ఉప్పాడ సెంటర్ కి వచ్చి చర్చించాలి అంటూ సవాల్ చేవారు.. ఎంపీగా పిఠాపురానికి గుండు సున్నా ఇచ్చారు అంటూ వంగా గీతపై విరుచుకుపడ్డారు..…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం పొలిటికల్ స్క్రీన్ మీద సరికొత్త సీన్స్ కనిపించబోతున్నాయట. ఆ సన్నివేశాలు నియోజకవర్గంలో పాజిటివ్ వైబ్స్ తీసుకు వస్తాయా? లేక నెగెటివిటీని పెంచుతాయా అని ఆసక్తిగా గమనిస్తున్నారు పొలిటికల్ పరిశీలకులు. వైసీపీ మాజీ నేత, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేనలో చేరడం ఖరారైపోయింది.
పిఠాపురం ట్రెండింగ్‌లో ఉన్న సెగ్మెంట్.. ప్రచారం ఎంత హోరాహోరీగా జరిగిందో.. పోలింగ్ కూడా అంతే ఆసక్తిగా సాగింది.. ఎన్నికల ఫలితాల ముందు అదికాస్త పీక్స్‌కు చేరుకుంది. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఎవరికివాళ్లు.. మా తాలుకా అంటే.. మా తాలుకా అని.. బోర్డులు తగిలించుకొని తిరుగుతున్నారు. వాహనాలకు నెంబర్ పేట్లకు బదులు.. మా పిఠాపురం ఎమ్మెల్యే ఫలానా అని.. రేడియంతో స్టిక్కరింగ్ చేయిస్తున్నారు. ఇలా తిరుగుతున్న వాహనాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిఠాపురంలో ఆధిపత్యపోరు ఓ…
Radium Stickers Light Up Pithapuram Streets: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత ఆసక్తిరేపిన నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. జనసేన అధినేత పవన్ కళ్యణ్ ఎప్పుడు అయితే పిఠాపురం నుంచి పోటీ చేస్తా అన్నారో అప్పటినుంచి దేశ రాజకీయాలు మొత్తం ఒక్కసారిగా అటువైపు చూడసాగాయి. ఈ నేపథ్యంలో పవన్ ను ఈసారి కూడా ఓడించేందుకు వైసీపీ విశ్వప్రయత్నాలు చేసింది. అయినా ఇక్కడి కాపులంతా పవన్ కు అండగా నిలబడ్డారనే అంచనాలు వెలువడ్డాయి. దీంతో ఈసారి పవన్ గెలుపుకు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జ్ వర్మ, మాజీ మంత్రి సుజయ కృష్ణా రంగారావులు కలిశారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. పిఠాపురంలో రాజకీయ పరిణామాలపై పవన్-వర్మ మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.
వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్‌తో పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు భేటీ అయ్యారు. పిఠాపురంలో వంగ గీత గెలుపు కోసం కృషి చేయాలని దొరబాబును ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. అంగీకరించిన దొరబాబు...పార్టీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని జగన్‌కు చెప్పారని తెలిసింది.
పిఠాపురం, యు.కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి.. కాపు సామాజిక వర్గ ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ సారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని పవన్ కల్యాణ్ ప్లాన్ చేస్తున్నారు.. అయితే, పవన్ కల్యాణ్‌కు చెక్ పెట్టేందుకు అధికార వైసీపీ పావులు కదుపుతోంది.. దీంతో.. పిఠాపురంలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి.. పవన్ విజయం పక్కానా? వంగ గీత అసెంబ్లీలో అడుగు పెడతారా?