Pithapuram : పిఠాపురం లో హల్చల్ చేస్తున్న నెంబర్ ప్లేట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పిఠాపురం ట్రెండింగ్‌లో ఉన్న సెగ్మెంట్.. ప్రచారం ఎంత హోరాహోరీగా జరిగిందో.. పోలింగ్ కూడా అంతే ఆసక్తిగా సాగింది.. ఎన్నికల ఫలితాల ముందు అదికాస్త పీక్స్‌కు చేరుకుంది. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఎవరికివాళ్లు.. మా తాలుకా అంటే.. మా తాలుకా అని.. బోర్డులు తగిలించుకొని తిరుగుతున్నారు. వాహనాలకు నెంబర్ పేట్లకు బదులు.. మా పిఠాపురం ఎమ్మెల్యే ఫలానా అని.. రేడియంతో స్టిక్కరింగ్ చేయిస్తున్నారు. ఇలా తిరుగుతున్న వాహనాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిఠాపురంలో ఆధిపత్యపోరు ఓ రేంజ్ లో నడుస్తుంది.. పవన్ అనుచరులు మొదలు పెట్టిన మైండ్ గేమ్‌కి వైసీపీ ధీటుగా కౌంటర్ ఇస్తోంది. మేమేం తక్కువ అంటూ సేం క్యాప్షన్‌ని.. వైసీపీ కి అప్లై చేసి రాసేస్తున్నారు. కొందరైతే ఇంకో అడుగు ముందుకేసి వంగా గీతకు పదవి కూడా ఇచ్చేశారు. వంగా గీత డిప్యూటీ సీఎం అంటూ కార్ల వెనుక రాయించుకుంటున్నారు. టూవీలర్‌ల నెంబర్ ప్లేట్లను గీత పేరుతో నింపేస్తున్నారు. పిఠాపురంలో ఇరుపార్టీల మధ్య ఆధిపత్య పోరు ముందు నుంచి ఉంది.
అభ్యర్థి ప్రకటన నుంచి ఎన్నికలు జరిగే వరకూ పిఠాపురం సెగ్మెంట్‌పై హాట్ హాట్‌గా డిబెట్లు సాగాయి. వాడివేడిగా వాదనలు నడిచాయి.. ఊహాగానాలు ఊపిరి సలపకుండా చేశాయి.. ఎవరికి వారుగా ధీమాగా ఉన్నారు. కొందరు మెజారిటీ ఎంత వస్తుందోకూడా.. నెంబర్లతో సహా చెబుతున్నారు. ఇప్పుడు ఏకంగా ఫలానా ఎమ్మెల్యే మా తాలుకా అని స్టిక్లర్లు అంటించుకొని తిరుగుతున్నారు. బైకులు, కార్లు, ఆటోలు ఇలా పిఠాపురంలో ఎక్కడ చూసినా రేడియం రేలారే రేలారే పడుతున్నాయి. ఫైనల్ గా ఎవరో ఒకరు ఎమ్మెల్యే అవుతారు. ఏం తేలకముందే.. ఏంటీ స్టిక్కర్ల వార్ అని పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతోంది. ఈ పోటీ ఆరోగ్యకరంగా ఉంటే ఎవరికీ ఇబ్బంది లేదు. ఎవరికి వారు పర్సనల్‌గా తీసుకుంటేనే పిఠాపురం పహిల్వాన్‌లకు మధ్య ఫైలింగ్ ఎక్కడికో పోతుందంటున్నారు.
Also Read
తాజావార్తలు
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
-
MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!