అజ్ఞాతంలోకి వెళ్లారన్న ప్రచారంపై వైసీపీ నేత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పందించారు. వ్యక్తిగత పనుల మీద హైదరాబాద్‌లో ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడికి వెళ్లిపోవాల్సిన అవసరం తనకు లేదన్నారు.
అల్లర నేపథ్యంలో గృహ నిర్బంధంలో ఉన్న వైసీపీ నేత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వారిద్దరూ గన్‌మెన్లను వదిలేసి వెళ్లిపోయినట్లు సమాచారం.
పల్నాడు జిల్లాలోని గురజాల, మాచర్ల నియోజకవర్గంలో వైస్సార్సీపీ, టీడీపీ శ్రేణుల మధ్య దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో మూడు రోజులుగా అట్టుడికిపోతున్నాయి. మంగళవారం నుంచి పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంది. ఈ నేపథ్యంలో మాచర్లలో ఏపీ డీఐజీ త్రిపాఠి మకాం వేశారు. పోలింగ్ జరిగి మూడు రోజులవుతున్నా ఇంకా చల్లారని ఉద్రిక్తత నెలకొని ఉంది. Also Read: Canada : కెనడాలో తగలబడుతున్న వేలాది ఎకరాల అడవి.. ప్రమాదంలో చమురు నిల్వలు ఈ నేపథ్యంలో మాచర్లలో…