Audimulapu Suresh Fires On Kotamreddy Sridhar Reddy: తన ఫోన్‌ను ట్యాప్ చేశారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేసిన ఆరోపణలపై మంత్రి ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. కోటంరెడ్డి చంద్రబాబుని కలవలేదా? అని ప్రశ్నించిన ఆయన.. కోటంరెడ్డి అడ్డంగా దొరికిపోవడం వల్లే ఇలా ట్యాపింగ్ డ్రామాకు తెరతీశాడని పేర్కొన్నారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని కోటంరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. అతను చూపించే విశ్వాసం ఇదేనా? అంటూ దుయ్యబట్టారు. కోటంరెడ్డికి ఓ పోలీస్ అధికారి ఆడియో రికార్డింగ్ పంపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పార్టీ మారే ఆలోచన పెట్టుకొని.. ప్రభుత్వంపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఏమాత్రం సరైనది కాదన్నారు. ప్రస్తుతం ప్రజలు టీడీపీని నమ్మే పరిస్థితి లేదని తేల్చి చెప్పారు.
RK Roja: సినీ పరిశ్రమకు విశ్వనాథ్ చేసిన సేవలు వెలకట్టలేనివి
ఇదే సమయంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. లోకేష్ పాదయాత్ర అట్టర్ ప్లాప్ అయ్యిందని, అందుకే కోటంరెడ్డిని అడ్డం పెట్టుకొని చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ అంటూ డైవర్ట్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. దమ్ముంటే.. కోటంరెడ్డి ఆ 51 సెకండ్ల ఆడియోను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుతో కోటంరెడ్డి కుమ్మక్కై, అడ్డంగా దొరికిపోయి, ఇప్పుడు ఈ దొంగ నాటకాలు ఆడుతున్నాడని ఫైర్ అయ్యారు. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి లాంటి వాళ్లు ఎంతమంది పోయినా.. పార్టీకి ఎలాంటి నష్టం జరగదన్నారు. పార్టీలో ఇలాంటి కోవర్టులు ఉంటే, సీఎం జగన్ కచ్చితంగా వాళ్లను బయటకు పంపుతారన్నారు. ఎవరెన్ని నాటకాలు ఆడినా.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపుని అడ్డుకోవడం ఎవరివల్లా కాదని ధీమా వ్యక్తం చేశారు.
Pakistan: కుడి చేతిలో ఖురాన్..ఎడమ చేతిలో అణుబాంబు.. ఆర్థిక సంక్షోభానికి పాక్ నాయకుడి పరిష్కారం
అంతకుముందు ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా కోటంరెడ్డికి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డికి తాను ఎలాంటి లబ్ధి చేకూర్చలేదని ప్రమాణం చేస్తానని.. మరి కోటంరెడ్డికి ప్రమాణం చేసే దమ్ము, ధైర్యం ఉందా? అని సవాల్ విసిరారు. కోటంరెడ్డి ఒక నమ్మకద్రోహి అని.. మంత్రి పదవి రాలేదనే ఇప్పుడు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటంరెడ్డి పచ్చి అబద్ధాల కోరు, విశ్వాస ఘాతకుడు అని కాకాణి దుయ్యబట్టారు.
Kodali Nani: ఆ గుట్టు తేలాలి.. మోడీకి, కేసీఆర్‌కి లేఖ రాస్తా