ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గులాబో దేవి కాన్వాయ్ మంగళవారం ప్రమాదానికి గురైంది. ఆమె కాన్వాయ్ ఢిల్లీ నుంచి బిజ్నోర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. పిల్ఖువా కొత్వాలి ప్రాంతంలోని జాతీయ రహదారి-9పై కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో గులాబో దేవి ప్రయాణిస్తున్న కారు కూడా ఢీకొట్టింది. గాయాలపాలైన ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.