పట్టుదల ఉంటే పేదరికం అనేది అడ్డుకాదని.. చదవాలనే తపన ఉంటే కుటుంబ పరిస్థితులు, వయస్సు అసలు ఆటంకమే కాదని నిరూపించింది ఓ మహిళ. లక్ష్యం జీవితాన్ని విజయపథాన నడిపిస్తుందనడానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది ఆ మహిళ. దినసరి కూలీగా ఎండనకా, వానెనకా చెమటోడుస్తూనే.. చదువుపై ఉన్న ఆసక్తితో అహోరాత్రాలూ శ్రమించింది. ఉన్నతంగా నిలబడాలన్న తపనతో ఎట్టకేలకు రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచింది.
Blind Girl Gets PHD: అంగవైకల్యం అనేది అభివృద్ధికి, ఎదుగుదలకు ఎలాంటి ఆటంకం కాదని ఎంతో మంది రుజువు చేశారు.. ఇప్పటికీ చాలా మంది రుజువు చేస్తూనే ఉన్నారు. అలాంటి వారిలో అంధుల గురించి గొప్పగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కళ్ళు లేకపోతే సాధారణంగా బయటే కాదు.. ఇంట్లో కూడా తిరగలేము. కళ్ళున్న వారు చదవాలంటేనే కష్టపడతారు.. అలాంటిది కళ్ళు లేకున్నా పట్టుదలతో చదవడం.. అందులోనూ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ(పీహెచ్‌డీ) పట్టాను సాధించడం సామాన్య విషయం కాదు. కానీ…