ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడినట్లు అధికారులు ధృవీకరించారు. మొదట బుధవారమే విడుదల కావాల్సి ఉండగా, వివిధ అనివార్య పరిస్థితుల కారణంగా ఇప్పుడు ప్రకటన ఆలస్యం అవుతుంది. మరో రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.
Gurukula Exam: గురుకుల పీజీటీ ఇంగ్లీష్ ఆన్‌లైన్ పరీక్షలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో హైదరాబాద్ హయత్ నగర్ పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులు ఆందోళనకు దిగారు. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.