ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. అదేంటే తెలుసుకోవాలనుంది కదా.. అయితే దీపావళి నుంచి ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బును వెంటనే విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్‌ఓ 3.0 అమలైతే పీఎఫ్ డబ్బు కోసం రోజులు వేచి చూడాల్సిన అవసరం ఉండదని ఈపీఎఫ్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. యూపీఐ యాప్‌లు లేదా ఏటీఎంల ద్వారా రూ. లక్ష వరకు అత్యవసర విత్‌డ్రాలను వెంటనే చేసుకోవచ్చు. 8 కోట్ల మందికి పైగా సభ్యులకు ఇది సాయపడుతుంది.…