Ambulance Misuse: అత్యవసర పరిస్థితుల్లోనే అంబులెన్స్‌లు సైరన్ వాడాలనే నిబంధనలను ఉల్లంఘిస్తూ.. ఒక అంబులెన్స్ డ్రైవర్ తన పెంపుడు కుక్కకు ఆపరేషన్ కోసం సైరన్‌తో వెళ్లడం హైదరాబాద్ నగరంలో తీవ్ర సంచలనం రేపింది. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ఈ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. సైరన్‌ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. ఈ క్రమంలో పంజాగుట్ట వద్ద అతి వేగంగా, సైరన్‌లు మోగిస్తూ వచ్చిన ఒక అంబులెన్స్‌ను పోలీసులు ఆపి తనిఖీ…