ప్రస్తుతం సహజంగా పండించే పండ్లు, కూరగాయలు చాలా తక్కువ. అన్ని పెస్టిసైడ్స్ వేసి పండిస్తున్నారు. వాటిని పండించే క్రమంలో వాటిపై పురుగు మందులు కొడుతుంటారు. వాటిని శుభ్రంగా కడిగి తినకుంటే లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి.
చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం వెదురుకుప్పంలో పురుగుల మందు తాగి చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అన్నదమ్ముల భూమి పరిష్కార విషయంలో పోలీసుల జోక్యం చేసుకుని.. చంద్రశేఖర్‌ను పోలీసులు కొట్టడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి చంద్రశేఖర్ (50) ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన పరిశోధనలో గర్భిణుల పాలలో పురుగుమందులు ఉన్నట్లు తేలింది. లక్నోలోని కేజీఎంయూలోని స్త్రీలు, శిశుజనన ఆసుపత్రి వైద్యులు ఈ పరిశోధన చేశారు. మేరీ క్వీన్స్ ఆసుపత్రిలో చేరిన 130 మంది శాకాహార, మాంసాహార గర్భిణులపై ఓ అధ్యయనం నిర్వహించి మాంసాహారం, శాకాహారం తీసుకునే గర్భిణుల తల్లిపాలలో క్రిమిసంహారక మందులు ఉన్నాయా అనేది పరిశీలించారు.
గుంటూరు జిల్లాలో మంత్రులు కన్నబాబు, మేకతోటి సుచరిత పర్యటించారు. ప్రత్తిపాడు మండలం కొండెపాడులో నల్లతామర పురుగుతో దెబ్బతిన్న మిర్చి పొలాలను పరిశీలించారు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, హోంమంత్రి సుచరిత. మిరప తోటలను పరిశీలించాం. ఏదో ఒక సమస్య రైతులను పీడిస్తోంది. గుంటూరు జిల్లాలోనే లక్షా ఆరు వేల హెక్టార్లలో మిర్చి సాగవుతుంది. తామర పురుగు ఇతర దేశాల నుండి వచ్చి మన మిరపపై దాడి చేసింది.దీనికి సంబంధించి మన శాస్త్రవేత్తలు నివేదిక ఇచ్చారన్నారు మంత్రి కన్నబాబు.…