Peshawar Mosque Blast: పాకిస్తాన్ పెషావర్ నగరంలో సోమవారం మసీదులో బాంబు పేలుడు కారణంగా 101 మంది మరణించారు. అత్యంత కట్టుదిట్టమైన ప్రాంతంలో బాంబు పేలుడు చోటు చేసుకోవడం పాకిస్తాన్ నిఘా వ్యవస్థను ప్రశ్నిస్తోంది. అయితే ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల అలసత్వం, భద్రతాలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.