Peru Bus Accident Today: దక్షిణ అమెరికా దేశమైన ఆగ్నేయ పెరూలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు కొండపై నుంచి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపుగా 25 మంది చనిపోగా.. 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని పెరూ అధికార వర్గాలు వెల్లడించాయి. ఆండెస్ పర్వతాల మీదుగా హుయాన్యాయో నుంచి హువాంటా వెళ్తుతుండగా.. అదుపు తప్పిన బస్సు ఒక్కసారిగా…