కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో ఓ వ్యక్తి రెండో పెళ్లి చేసుకుంటూ భార్యకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. యాదాద్రి జిల్లా భువనగిరికి చెందిన మధుబాబు నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ బోడుప్పల్‌కు చెందిన సరితను వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన వెంటనే సరితకు అత్తింటి నుంచి వరకట్న వేధింపులు మొదలయ్యాయి. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. మూడేళ్లుగా సరిత తల్లిదండ్రుల వద్దే నివసిస్తోంది. భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మధుబాబు మళ్లీ పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించగా సరిత రెండుసార్లు అడ్డుకుంది. అయినా అతడు…