చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కేఆర్‌జే భరత్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. నామినేషన్ యాత్ర విజయ యాత్రగా కనిపిస్తుందన్నారు.
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. గురువారం రోజు కిరణ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు ఈ రోజు కౌంటర్ ఇచ్చారు మంత్రి పెద్దిరెడ్డి.. చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదేళ్లు అజ్ఞాతంలో ఉండి ఇప్పుడు వచ్చి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు అని ఫైర్ అయ్యారు.. నేను కాంగ్రెస్ లో ఉండి సోనియా గాంధీ కాళ్లకే మొక్కలేదు.. కానీ, కిరణ్ కుమార్ రెడ్డి…
ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వైసీపీ నేతలు నియోజకవర్గాల వారీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు శ్రీ సత్యసాయి జిల్లాలోని గాండ్లపెంట, కదిరి రూరల్, తనకల్లు మండలాల్లో ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. మంచి చేశారు కాబట్టే తనకు ఓటు వేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడుగుతున్నారన్నారు. చంద్రబాబు ఐదేళ్లు రాజధాని పేరుతో వృధా చేసి, లోపభూయిష్టంగా నాలుగు భవనాలు కట్టారని…
రాళ్ళ దాడిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ తిరుపతిలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి చంద్రబాబు రాళ్ళతో కొట్టాలని పిలుపునిచ్చారన్నారు. చంద్రబాబు నాయుడు వద్ద మంచి పేరు కోసం టిడిపి వారే శ్రీ వైఎస్ జగన్ పై రాళ్ళు విసిరారని ఆయన వ్యాఖ్యానించారు. ఒకే రాయి సీఎంకు తగిలి, పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్‌కి తగిలిందని, అయన కూడా కంటికి చికిత్స తీసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డికి ఎక్కడ సింపతీ…
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, నారా లోకేష్ గతంలో ఏం చేశాం.. గెలిస్తే ఏం చేస్తామో ప్రజలకు చెప్పడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు భవిష్యత్తు కే గ్యారెంటీ లేక పొత్తులు పెట్టుకున్నాడు అని మండిపడ్డారు.
గతంలో ఇద్దరు కేంద్ర మంత్రులను ఒడించామని, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిని ఒడిస్తామన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. ఇవాళ ఆయన చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ.. చిత్తు చిత్తుగా కిరణ్ కుమార్ రెడ్డిని ఓడిస్తామని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు శ్రీ వైఎస్ జగన్ ను కిరణ్ కుమార్ రెడ్డి వేధించారని, ప్రత్యేక హోదా రాకపోవడానికి, రాష్ట్ర విభజన జరగడానికి కిరణ్ కుమార్ రెడ్డి కారణమన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు నిస్సిగ్గుగా బీజేపీలో చేరారన్నారు. కిరణ్…