శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ పరిధిలోని కిరికెరలో వైసీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూపురం ఒక అద్దాల మేడ.. రాయి వేస్తే పగులుతుందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బాలయ్యపై పోటీకి బీసీ మహిళను ప్రయోగిస్తున్నామని వ్యాఖ్యలు చేశారు. హిందూపురంలో రాబోయే ఎన్నికల్లో బాలకృష్ణ అయినా.. ఆయన అల్లుడు అయినా.. ఆయన వియ్యంకుడు చంద్రబాబు అయినా ఓడిపోవాల్సిందేనని తెలిపారు.…
Minister Peddireddy Ramachandra Reddy: తన 45 సంవత్సరాల రాజకీయం జీవితంలో పేదల కోసం ఈ స్థాయిలో పని చేసిన ముఖ్యమంత్రిని చూడలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి నారా చంద్రబాబు నాయుడు చేసిందేమీ లేదని, వైఎస్ జగన్ మొదటిసారి ముఖ్యమంత్రి అవ్వగానే అన్ని బీసీ కులాలకు కార్పొరేషన్లు తెచ్చారని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా…
కుప్పం ఎమ్మెల్యే, టీడీపీ అధినేత చంద్రబాబు కురబ కులస్థుల ఆరాద్య దైవం కనక దాసు విగ్రహం ఏర్పాటుకు ప్రాధాన్యత కల్పించాలని ఎందుకు ఆలోచించలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. కురబ కులస్థులను గుర్తించిన పార్టీ వైసీపీ పార్టీనే అని ఆయన తెలిపారు.
నంద్యాల జిల్లా బనగానపల్లెలో నాపరాతి గనుల యజమానులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, కలెక్టర్ మున్జీర్ సామూన్ జిలానీ, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిలు పాల్గొన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మైనింగ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఇసుకాసురుడు అంటు చంద్రబాబు జగన్‌పై ఆరోపణలు చేశారని, ఇసుక విధానం పై 19 సార్లు చంద్రబాబు జీవోలు తెచ్చారని పేర్కొన్న మంత్రి.. ఇసుకను దోచిన వారే ఆరోపణలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు.
చంద్రబాబు పర్యటనలో ప్రసంగించిన తీరు వివాదస్పదంగా మారింది అని.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన కామెంట్స్.. ప్రజలని రెచ్చగొట్టేలా ఉన్నాయని మంత్రి బొత్స ఆరోపించారు. పుంగనూరు పర్యటనలో మాటలతో మొదలైన వివాదం చివరకు కొట్టుకునే స్థాయికి చేరింది అని మంత్రి తెలిపారు.