జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మరో విద్యార్థి పాము కాటుకు గురయ్యాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న బోడ యశ్వంత్‌ను పాముకాటేసింది. స్కూల్ ప్రిన్సిపల్.. యశ్వంత్‌ను హుటాహుటిన కోరుట్ల ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో విద్యార్థికి చికిత్స అందిస్తున్నారు. బుధవారం అదే పాఠశాలలో ఓంకార్ అఖిల్ అనే విద్యార్థిని పాము కాటేసింది. తాజా ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎనిమిదో తరగతి చదువుతున్న యశ్వంత్ ఈరోజు నిద్ర లేచేసరికి కాలుకు గాయమై.. దురదలు వచ్చాయి. అతడు విషయాన్ని…