గత ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. ఐదేళ్లలో అన్నీ వ్యవస్థలు భ్రష్టు పట్టాయని విమర్శించారు..పోలీసులకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించటంలో గత ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు.. అయితే, టెక్నాలజీని ఉపయోగించుకోవటంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆదర్శంగా తీసుకోవాలన్నారు..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. మహిళల భద్రత, రాజధానిలో పెరుగుతున్న నేరాల గ్రాఫ్‌ను ఎన్నికల ముందు పెద్ద సమస్యగా మార్చాలని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తోంది. గత నెల రోజుల నుంచి ఢిల్లీలో శాంతిభద్రతలు, మహిళా భద్రతపై కేజ్రీవాల్ కేంద్రాన్ని నిందిస్తున్నారు. వీటిని ఆయుధంగా మలచుకున్నట్లు కనిపిస్తోంది. ఈ అంశాల్లో కేంద్రం పూర్తిగా విఫలమైందని జనాలను నమ్మించి.. ఓట్లు దండుకునేందుకు యత్నిస్తున్నారని పలువురు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
Telangana DGP: రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో సీరియస్ గా వ్యవహరించాలని డీజీపీకి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. దీంతో డీజీపీ జితేందర్ నగరంలో మూడు కమిషనరేట్ల సీపీలతో సమావేశం ఏర్పాటు చేశారు.