రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని జయసుధ విచారణ పూర్తయింది. మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధను 2 గంటలపాటు పోలీసులు ప్రశ్నించారు. విచారణలో ఆమె సమాధానాలతో పోలీసులు సంతృప్తి చెందలేదు. మరోసారి నోటీసులు ఇచ్చి విచారించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. కాగా.. విచారణలో పోలీసులు 45 ప్రశ్నలు అడిగారు. గోడౌన్ నిర్వహణ అంతా మేనేజర్ మానస తేజ చూస్తారని ఆమె చెప్పింది
రేషన్ బియ్యం మాయం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. రేషన్ బియ్యం కేసు విచారణలో భాగంగా బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్‌పేట పోలీస్ స్టేషన్‌కు రావాలని నోటీసులలో పేర్కొన్నారు. ఈ కేసులో జయసుధకు ఇప్పటికే కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పోలీసు విచారణకు సహకరించాలని కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి నోటీసులు ఇచ్చేందుకు పేర్ని నాని నివాసానికి పోలీసులు…
హైకోర్టుకు చేరింది కాకినాడ పోర్టులోని ఎంవీ స్టెల్లా నౌక వ్యవహారం..తమ పారా బాయిల్డ్ రైస్ ను స్టెల్లా నౌకలో లోడు చేసేందుకు అనుమతి ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.. అయితే, దీనిపై వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది న్యాయస్థానం.. బియ్యం రవాణా చేసేందుకు అనుమతులు ఉన్నాయా? అని ప్రశ్నించింది హైకోర్టు.. నౌకలో బియ్యం లోడు చేయకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఏమిటని ఈ సందర్భంగా ప్రశ్నించింది.