ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీ టీడీపీతో కలిసి పనిచేస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల ప్రకటించారు. అయితే తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో జనసేన అభ్యర్థిత్వంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. breaking news, latest news, telugu news, janasena, pawan kalyan
కులాల గురించి ఆలోచిస్తే ఎప్పటికీ అభివృద్ధి సాధించలేమని జనసేన అధినేత పవన్కళ్యాణ్ వెల్లడించారు. వారాహి యాత్రలో భాగంగా మచిలీపట్నంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. మచిలీపట్నానికి చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లపై మంత్రి మేరుగ నాగార్జున విరుచుకుపడ్డారు. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మహాత్ముడి జయంతిన దీక్ష చేస్తాడట.. ప్రజాస్వామ్యం, స్వాతంత్య్ర ఉద్యమం మీద అవగాహన ఉంటే ఇలాంటి పనులు చేయడంటూ మంత్రి వ్యాఖ్యానించారు.
చంద్రబాబు మెంటల్లీ సిక్ అని చెప్పి జైలుకు తీసుకువస్తావా పవన్? పోసాని కృష్ణమురళి అడిగారు. అసలేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా పవన్?.. కాపు నాయకుడ్ని, లెజెండ్ ని చంపిన దుర్మార్గుడ్ని జైలు నుంచి బయటకు తీసుకొస్తావా పవన్.. కాపు వ్యతిరేకి చంద్రబాబు.. మీరు ఎవర్నైనా ఎన్నుకోండి.. ఎవరికైనా ఓట్లు వేయండి కానీ చంద్రబాబుకు వేయకండి అని ఆయన కోరారు.
అయ్యా పవన్ కళ్యాణ్ ... ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏంటి?.. బీజేపీతో ఉన్నట్లా? లేనట్లా? అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. అనైతిక, విశ్వాస రహిత రాజకీయ.. బీజేపీ చెవిలో పవన్ కళ్యాణ్ క్యాలీ ఫ్లవర్ పెట్టాడు.. వ్యక్తిగత జీవితంలో కూడా అంతే.. ఒక పెళ్ళి చేసుకుని మరొక ఆమెతో బంధం నడిపావు..
మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రీ జయంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి జాతీయ జెండా ఇచ్చిన నేల మీద గాంధీ జయంతి చేసుకోవడం నా అదృష్టం అని ఆయన వ్యాఖ్యనించారు.
2024లో వచ్చేది జనసేన - టీడీపీ సంకీర్ణ ప్రభుత్వమేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జగన్ లాగా డబ్బు పేరుకుపోయి ఉన్న నేతను ఎలా అడ్డుకోవాలో తనకు తెలుసన్నారు. తమకు నైతికంగా బలం ఉంది కాబట్టే.. నేనింత బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొనే వాడిని అయ్యామన్నారు. తాను ప్యాకేజ్ తీసుకున్నానని ఆరోపిస్తున్నారని.. తనకు డబ్బంటే ప్రేమ లేదని వాళ్లకెలా చెప్పనంటూ పేర్కొన్నారు.
ఈ సారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని జగన్ అంటున్నారని.. జగన్ ఓటమి ఖాయమని, మేం అధికారంలోకి రావడం ఖాయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో వారాహి విజయ యాత్ర బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు.