Pawan Kalyan: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో నవంబర్ 1 న ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. ఇక ఈ పెళ్ళికి మెగా, అల్లు కుటుంబాలతో పాటు సన్నిహితులు హాజరయ్యారు. ఇక పెళ్లి పనులు పూర్తికావడంతో ఒక్కొక్కరు ఇండియాకు బయలుదేరుతున్నారు. ఇక ఇప్పటికే నితిన్ దంపతులు, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్.. ప్రత్యేక ఫ్లైట్ లో ఎయిర్ పోర్ట్ లో అడుగుపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఇండియాలో అడుగుపెట్టాడు. పెళ్లికి వెళ్లిన దగ్గర నుంచి పవన్ ఎక్కడా కనిపించింది లేదు. ఇక చివరి రోజు మాత్రమే పవన్ కెమెరా కంటికి కనిపించాడు. అందరు పెళ్లి వేడుకల్లో డిజైనర్ డ్రెస్ లలో దర్శనమివ్వగా.. పవన్ మాత్రం చాలా సింపుల్ లుక్ లో కనిపించి షాక్ ఇచ్చాడు. ఇక నిన్నటి నుంచి పవన్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Akshara Haasan: కమల్ కూతురా.. మజాకానా.. రూ.15.75 కోట్లతో ఇల్లు అంటే మాటలా..?
ఇక నేడు పవన్ కళ్యాణ్ పెళ్లి పూర్తయ్యాక ఇండియాకు బయల్దేరిన విషయం తెల్సిందే. ఇక ఎయిర్ పోర్ట్ లో పవన్ అడుగుపెట్టినప్పటి నుంచి ఫొటోగ్రాఫర్లు కెమెరాలకు పనిచెప్పారు. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో పవన్ అదిరిపోయాడు. ఇక పవన్ ఎయిర్ పోర్ట్ లుక్ ఉన్న వీడియో కు OG లోని నెత్తురు మరిగిన హంగ్రీ చీతా మ్యూజిక్ యాడ్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం పవన్ .. ఉస్తాద్ భగత్ సింగ్, OG, హరిహర వీరమల్లు చిత్రాల్లో నటిస్తున్నాడు. మరి ఈ సినిమాలతో పవన్ ఎలాంటి హిట్లు అందుకుంటాడో చూడాలి.