విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్డీఏ కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మాట్లాడుతూ.. జనసేన పార్టీ లేదు, గుర్తింపు లేదు జగన్ మోహన్ రెడ్డి మీద తొడ కొడతాడంట అని విమర్శించారు. ఈరోజు నీ గ్లాస్ నీ దగ్గర లేదని దుయ్యబట్టారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లి సుభాష్ చంద్రబోస్, తోట త్రిమూర్తులు ఇద్దరూ ఒకప్పుడు కొట్టుకున్నారని.. మళ్లీ రాజకీయం గురించి కలిసిపోయారని ఆయన పేర్కొన్నారు. ఇద్దరు రావులపాలెం టు యానాం ఏటిగట్టు రోడ్డు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారని ప్రశ్నించారు.
Sudigali Sudheer to Campaign for Pawan Kalyan: ఏపీ సహా తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ప్రచారాలు పెద్ద ఎత్తున జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగుదేశం, బిజెపితో కలిసి కూటమి ఏర్పాటు చేసి బరిలోకి దిగింది. కూటమి అభ్యర్థిగా జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారనే విషయం తెలిసినప్పటి నుంచి సినీ నటులు, టెక్నీషియన్లు కొంత…
ఈ ఐదేళ్ళ లో బాగుపడిన వర్గాలు ఎవరు లేరని.. ఈ రోజు నేను పెట్టిన మేనిఫెస్టో తో అన్ని వర్గాలు బాగుపడతాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తెనాలిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ..
న్డీఏ కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ-జనసేన మేనిఫెస్టోపై మోడీ ఫొటో పెట్టవద్దని ఢిల్లీ నుంచి వాళ్లకు ఫోన్ వచ్చిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ముగ్గురు కూటమిలో ఉండి.. ముగ్గురి ఫోటోలను మేనిఫెస్టోలో పెట్టుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదన్నారు.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను మూడు పార్టీల నేతలు ఆవిష్కరించారు. ఉమ్మడి మేనిఫెస్టో చంద్రబాబు, పవన్ కల్యాణ్, సిద్జార్థ్ నాథ్ సింగ్‌లు విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల హడావుడి కొనసాగుతుంది.ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎన్నికల హడావిడిలో ఎంతో బిజీ గా వున్నారు.ఈ నేపథ్యంలో పవన్ తన లైనప్ లో వున్న మూడు సినిమాల షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చారు.వాటిలో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ మరియు ఓజి సినిమాలు వున్నాయి .ప్రస్తుతం ఈ మూడు చిత్రాల ప్రొడ్యూసర్స్ పవన్ డేట్స్ కోసం పవన్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు .ఇదిలా ఉండగా క్రిష్ – పవన్ కాంబోలో…
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కాపు ఉద్యమనేత, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం.. పవన్ కల్యాణ్‌కు బహిరంగ సవాల్ విసిరారు.. పవన్ ను పిఠాపురంలో నేను ఓడించకపోతే.. నా పేరు మార్చుకుంటా.. పవన్‌ను ఓడించలేకపోతేనే నా పేరు పద్మనాభం కాదు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అన్నారు..