పవన్‌ను ఉద్దేశించి సీఎం జగన్ కామెంట్లు బాధాకరమని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. సమాజంలో అలజడి సృష్టించేలా సీఎం జగన్ కామెంట్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తనం చేసారు. పవన్‌ను రాజకీయంగా ఎదుర్కొలేక వ్యక్తిగత విమర్శలు చేశారని నిప్పులు చెరిగారు. గతంలో పవన్‌ను తిట్టించేందుకు మంత్రులతో ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టించారని గుర్తు చేసారు. ఇప్పుడా మంత్రులు పదవులు కొల్పోయారని, పవన్ కళ్యాణ్‌ను విమర్శించే సమయాన్ని ప్రజల సంక్షేమం కోసం వెచ్చించండని ఎద్దేవ చేసారు. రాష్ట్ర భవిష్యత్‌ను…