ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ నేత పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో పట్టాభి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పెద్ద ఎత్తున పోలీసులు చేరుకోవడంతో పట్టాభి అరెస్ట్ ఖాయమని తెలుస్తోంది. పట్టాభి చేసిన వ్యాఖ్యలు అధికార, ప్రతిపక్షాల మధ్య రణరంగంగా మారాయి. ఇప్పటికే ఏపీ పోలీసులు కూడా పట్టాభి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. చట్టబద్ధమైన పదవుల్లో ఉన్నవారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం…