ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పట్నం మహేందర్‌రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం శాఖలను కేటాయించింది. సమాచార పౌర సంబంధాల శాఖ, గనులు భూగర్భవనరుల శాఖను ఆయనకు కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇవాళ (శనివారం) ఉత్తర్వులు జారీ చేశారు.
సీఎం కేసీఆర్ కేబినెట్ లోకి పట్నం మహేందర్ రెడ్డికి అవకాశం కల్పించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఆయన రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పట్నం మహేందర్ రెడ్డితో ప్రమాణం చేయించారు.
మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి , నాగర్ కర్నూల్ జిల్లాకు ఇన్‌చార్జి వ్యవహార శైలి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి.
Off The Record: పట్నం మహేందర్‌రెడ్డి. మాజీ మంత్రి.. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న ఈయన కొంతకాలంగా అధికారపార్టీలో చర్చగా మారారు. ఆయన వైఖరి వల్ల పార్టీ హైకమాండ్ దగ్గర పంచాయితీలు అయిన ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు మహేందర్‌రెడ్డికి తోడు ఆయన భార్య.. జడ్పీ ఛైర్‌పర్సన్ సునీత సైతం స్వరం పెంచారు. ఇప్పటి వరకు మహేందర్‌రెడ్డి ఒక్కరే అసంతృప్తిని వ్యక్తం చేసేవారు.. తనపై కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే గెలిచి.. గులాబీ శిబిరంలో చేరిన పైలెట్ రోహిత్‌రెడ్డిపై కయ్‌మనేవారు.…
Controversy around Patnam Mahender Reddy couple ఊరందరిదీ ఒక దారైతే.. ఉలిపికట్టుది మరోదారి అన్నట్టుగా ఉంది అక్కడ టీఆర్‌ఎస్ పంచాయితీ. తాజా రగడపై రెండు వర్గాలను పిలిచి పార్టీ పెద్దలు క్లాస్ తీసుకున్నారు. మరి.. సమస్య కొలిక్కి వచ్చినట్టేనా? ఆ ఫ్యామిలీ చుట్టూనే ఎందుకు చర్చ.. రచ్చ అవుతోంది? ఎవరా నాయకులు? రాజకీయాల్లో ఇదో రకమైన ఉడుంపట్టు. అధికారపార్టీలో పెద్ద పదవుల్లో ఉన్నా.. ఏదో వెలితి. అసెంబ్లీకి పోటీ చేయాలి.. గెలిచి పట్టుసాధించాలి. ఈ…
టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. వచ్చే ఎన్నికల్లో తాను తాండూరు నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు.. పార్టీ నాకే టిక్కెట్ ఇస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. అంతేకాదు.. తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ఐదేళ్లు పదవిలో ఉంటారని.. నాలుగేళ్ల తర్వాత అవిశ్వాసం పెట్టినా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు..…
ఆ నియోజకవర్గంలో అధికారపార్టీ నేతల మధ్య అస్సలు పడటం లేదు. ఆ ప్రభావం పార్టీ కమిటీలపైనా పడింది. మరోసారి ఆధిపత్య పోరుకు దారితీసింది. ఒక నియోజకవర్గం.. రెండు కమిటీలుగా పరిస్థితి మారిపోయింది. ఎక్కడో ఏంటో.. లెట్స్ వాచ్! తాండూరులో ఎవరి కమిటీ వారిదే..! వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ నేతలు మరోసారి వార్తల్లో నిలిచారు. సంస్థాగతంగా పార్టీ బలోపేతం కోసం గ్రామ, వార్డు, మండల, నియోజకవర్గ, జిల్లా కమిటీలను ఏర్పాటు చేయాలని పార్టీ అధిష్ఠానం నేతలందర్ని ఆదేశించింది. ఇప్పుడు…
ఆ మాజీ మంత్రి సొంత నియోజకవర్గంలో దూకుడు పెంచారా? వచ్చే ఎన్నికలకు ఇప్పుటి నుంచే వర్కవుట్ చేస్తున్నారా? సెంటిమెంట్‌ను రగిలించడంతోపాటు.. వారసులకు రాజకీయంగా తగిన ఉపాధి చూపించే పనిలో పడ్డారా? సీటు ఖాళీలేని చోట ఆయన ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయి? ఎవరా మాజీ మంత్రి? తాండూరు టికెట్ తనదే అని పట్నం ప్రచారం! పట్నం మహేందర్‌రెడ్డి. టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి. ప్రస్తుతం ఎమ్మెల్సీ. టీఆర్‌ఎస్ తొలి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మహేందర్‌రెడ్డి.. 2018 ముందస్తు…