Patalkot Express: మరో రైలు ప్రమాదానికి గురైంది. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ నుండి మధ్యప్రదేశ్‌లోని శివానికి వెళ్తున్న పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్ (14624)లోని నాలుగు కోచ్‌లలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రా జిల్లా థానా మల్పురాలోని బధాయి రైల్వే స్టేషన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రైలు ఆగ్రా నుంచి ఝాన్సికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.