Hyderabad: ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌లో పాస్ పోర్ట్ సేవా కేంద్రం ప్రారంభమైంది.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సేవలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే మొట్టమొదటి సారిగా మెట్రో స్టేషన్‌లో పాస్ పోర్ట్ సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.. పాస్ పోర్ట్ ఇవ్వడంలో దేశంలోనే హైదరాబాద్ ఐదవ స్థానంలో ఉందన్నారు.. తెలంగాణలో ఇప్పటి వరకు ఐదు పాస్ పోర్ట్ సేవ కేంద్రాలు ఉన్నాయని వివరించారు.. తెలంగాణాలో రోజుకు 4500 పాస్ పోర్టులు ఇచ్చే సౌకర్యం ఉంది..
గచ్చిబౌలిలోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయానికి మాజీ సీఎం కేసీఆర్ చేరుకున్నారు. అమెరికా వీసా కోసం కాన్సులేట్ కార్యాలయానికి వచ్చారు. ఇప్పటికే సికింద్రాబాద్ పాస్ పోర్ట్ కార్యాలయంలో పాస్పోర్ట్ రెన్యువల్ కి సంబంధించిన లీగల్ టీమ్ సమర్పించారు.. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నేరుగా అమెరికన్ కాన్సులేట్ కి చేరుకున్నారు.. కేసీఆర్ తో పాటు జోగినపల్లి సంతోష్, జీవన్ రెడ్డి ఉన్నారు..
KCR: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) తెలంగాణ భవన్‌లో జరుగనున్న పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యేందుకు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ నుంచి నగరానికి బయల్దేరారు. దాదాపు ఎనిమిది నెలల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్‌కు రావడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి “తాను కొడితే మామూలుగా ఉండబోదు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి బీఆర్‌ఎస్ మరోసారి ముమ్మరంగా కార్యాచరణ సిద్ధం…