తెలుగు చిత్రసీమలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా పరుచూరి బ్రదర్స్ మాటలు కోటలు దాటుతూ, సినీజనానికి కోట్లు సంపాదించి పెడుతూనే ఉన్నాయి. అన్న వెంకటేశ్వరరావు అనురాగం పలికిస్తే, తమ్ముడు గోపాలకృష్ణ ఆవేశం ఒలికిస్తారు. ఎంత అన్నదమ్ములైనా నలభై ఏళ్ళుగా కలసి రచనావ్యాసంగం సాగించడమంటే మాటలు కాదు. బహుశా చిత్రసీమలో ఇది ఓ అరుదైన విశేషమని చెప్పాలి. సెంటిమెంట్ ను వండడంలో మేటి వెంకటేశ్వరరావు అని పేరు, ఇక ఎమోషన్ పండించడంలో గోపాలకృష్ణకు సాటి లేరెవ్వరు అంటూ ఉంటారు. వారితో…