Parole to marry girlfriend:ఇటీవల అత్యాచార కేసులో నిందితుడైన యువకుడికి బాధితురాలిని పెళ్లి చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది ఓ కోర్టు. పోలీసులు, అధికారులు సమక్షంలో అంగరంగ వైభవంగా వారి పెళ్లి జరిగింది. ఇదిలా ఉంటే మరోసారి ఇలాంటి కేసే తెరపైకి వచ్చింది. హత్యకేసులో పదేళ్ల శిక్ష అనుభవిస్తున్న నిందితుడు తన ప్రియురాలిని పెళ్లి చేసుకునేందుకు కర్ణాటక హైకోర్టు 15 రోజుల పెరోల్ పై విడుదల చేసింది.