తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కు తెలంగాణా ఫిలిమ్ ఛాంబర్ కృతజ్ఞతలు తెలిపింది. సినిమా ప్రదర్శనదారులతో కలసి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, కె.టి.రామారావు, తలసాని శ్రీనివాసయాదవ్, ఛీప్ సెక్రటరీ సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్ కు ఓ లేఖ రాస్తూ తమ అభ్యర్ధన మేరకు సింగిల్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునే సౌలభ్యం కలిగించినందుకు కృతజ్ఞతలు తెలియచేశారు. పలు సమస్యల వల్ల థియేటర్లు మూతవేసుకునే పరిస్థితి వచ్చిందని ఇప్పుడు ప్రభుత్వం తమను ఆదుకునేందుకు ముందుకు…