అలనాటి కథానాయిక, నాట్యకారిణి శోభన, ప్రముఖ మలయాళ నటుడు సురేశ్ గోపీ, యంగ్ హీరో దుల్కర్ సల్మాన్, కళ్యాణి ప్రియదర్శన్ కీలక పాత్రలు పోషించిన సినిమా ‘పరిణయం’. సెప్టెంబర్ 24 నుండి ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. గత యేడాది ఫిబ్రవరి మొదటి వారంలో విడుదలైన ‘వరనే అవశ్యముంద్’కు ఇది అనువాదం. నీనా (శోభన) సింగిల్ మదర్. హౌస్ వైఫ్ గా ఉండిపోకుండా రకరకాల వ్యాపకాలతో నిత్యం బిజీ ఉంటుంది. ఫ్రెంచ్ ట్యూటర్ గా పనిచేయడంతో…