వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మూడు గ్రామాలలో భూకంపం సంభవించింది. బసిరెడ్డిపల్లి, రంగాపూర్, నామత్ నగర్, హనుమాన్ గండి ప్రాంతాలలో భూ ప్రకంపనలు వచ్చాయని గ్రామస్తులు తెలిపారు. కొన్ని సెకన్లపాటు భూమి కంపించిందని ఇంట్లో ఉన్న సామాన్లు కిందపడినట్లు వెల్లడించారు. భూకంపం సంభవించిన వెంటనే ఇళ్లలోంచి బయటకు వచ్చామని తెలిపారు. ఓ వైపు వర్షాలతో బెంబేలెత్తుతుంటే మరోవైపు భూ ప్రకంపనలు వికారబాద్ జిల్లాలో భయాందోళనలు కలిగిస్తున్నాయి.
ఆన్‌లైన్ గేమ్స్ మరో యువకుడి ప్రాణాలు తీసింది. బెట్టింగ్‌లో డబ్బులు కోల్పోవడంతో మనస్తాపం చెందిన యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం పైరేట్ గ్రామానికి చెందిన జైచంద్రగా గుర్తించారు. ఆన్‌లైన్ గేమ్స్, యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవద్దంటూ టీషర్ట్‌పై రాసుకున్నాడు యువకుడు. అయితే.. బెట్టింగుల కారణంగా తీవ్ర అప్పుల పాలై అవి తీర్చలేక ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.