చాలా ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు వడ్లను సేకరించి..మర పట్టించిన తరువాత తమకు అవసరం ఉన్నంత మేర ఉంచుకుని మిగతా బియ్యాన్ని కేంద్రానికి పంపిస్తున్నాయి. అలా రైతుల నుంచి రాష్ట్రాలు సేకరించిన మొత్తం ధాన్యానికి కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. ఆ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్లలో నిల్వ చేస్తుంది. ప్రస్తుతం మన దగ్గర వచ్చే మూడేళ్ల అవసరాలకు సరిపడ ధాన్యం నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి బియ్యం కొనుగోలు చేయడం…
ఢిల్లీలో టీఆర్ ఎస్ దీక్షపై కేంద్రం స్పందించింది. కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ వివరణ ఇచ్చింది. పారా బాయిల్డ్ రైస్ ను కొనలేమని మరోసారి స్పష్టం చేసింది కేంద్రం. 2021-22 రబీ సీజన్ కు సంబంధించి తెలంగాణా ప్రభుత్వం ఇప్పటివరకు ధాన్యం సేకరణ ప్రతిపాదనలు పంపలేదు. ప్రతిపాదనలు పంపాలని కేంద్రం అనేకసార్లు తెలంగాణను కోరింది. రబీ నుంచి ముడి బియ్యం సేకరణపై ప్రతిపాదనల కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాం అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.…
కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య వరిధాన్యం విషయంలో యుద్ధం సాగుతూనే వుంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు వ్యతిరేకంగా లోకసభలో ప్రివిలైజ్ మోషన్ నోటీస్ ఇచ్చారు టీఆర్ఎస్ ఎంపీలు. వరి ధాన్యం కొనుగోలు విషయమై పార్లమెంటు ను, దేశ ప్రజలని, రైతులను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తప్పుదోవ పెట్టించారని సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం (ప్రివిలేజ్ మోషన్) నోటీసులో పేర్కొన్నారు. నోటీసును స్పీకర్ ఓంబిర్లాకు అందజేశారు టీఆర్ ఎస్ ఎంపీలు నామా నాగేశ్వరరావు,కొత్త ప్రభాకర్…