గోదావరి వరదలు కారణంగా జులైలో నిలిపివేసిన పాపికొండలు విహారయాత్ర.. ఇవాళ్టి నుంచి తిరిగి ప్రారంభమైంది. ఏపీ టూరిజం శాఖకు చెందిన ఒక బోటు.. ప్రైవేట్ ఆపరేటర్లకు సంబంధించిన మరో 14 బోట్లు అందుబాటులోకి వచ్చాయి.
పాపికొండల పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అధికారులు.. దీంతో.. నాలుగు నెలల తర్వాత పాపికొండల పర్యటన తిరిగి ప్రారంభం కానుంది.. పాపికొండల పర్యటనలు పునః ప్రారంభించాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.. అందులో భాగంగానే ఎస్‌డీఆర్ఎఫ్ టీంతో మాక్ డ్రిల్ నిర్వహించారు.. ఈ సందర్భంగా రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ మాట్లాడుతూ.. పాపికొండల పర్యటనలు శనివారం నుండి మొదలుకానున్నాయని.. అందులో భాగంగానే పాపికొండల బోట్లను తనిఖీ చేసిన అనంతరం మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందని వెల్లడించారు..
Papikondalu Tour Cancel: వాతావరణంలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి.. ఎండలు దంచికొట్టాల్సిన సమయంలో వానలు కురుస్తున్నాయి.. వడగాలులు వీయాల్సిన వేళ.. ఈదురుగాలులు వణికిస్తున్నాయి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు.. చాలా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో, అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పాపికొండల విహారయాత్రను నిలిపివేసింది.. ఇప్పటికే పలుమార్లు.. పాపికొండల టూర్ వాయిదా పడగా.. ఇప్పుడు మరోమారు బ్రేక్ పడింది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు వాతావరణ శాఖ తుపాను హెచ్చరికలు జారీ…