Hyderabad: హైదరాబాద్ పంజాగుట్టలోని ఓ కాలేజీకి చెందిన విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కడం కలకలం రేపింది. పంజాగుట్ట నాగార్జున సర్కిల్ పరిధిలో ఐదుగురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు10 గ్రాముల ఎండీఎంఏ (MDMA) డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. నాగార్జున సర్కిల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురు యువకులను గమనించిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో వారు డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు గుర్తించారు.