Jammu Kashmir: ప్రాణభయంతో కశ్మీరీ పండిట్లు లోయను విడిచిపెట్టి వలస వెళ్తున్నారు. ఈ క్రమంలో షోపియాన్ జిల్లా చౌదరిగుండ్ గ్రామంలో డాలీ కుమారి చివరి కశ్మీరి పండిట్.
ఇన్సానియత్….మానవత్వం. జమ్హూరియత్….ప్రజాస్వామ్యం. కశ్శీరియత్ స్నేహం….ఈ మూడు తమ కాశ్మీర్ విధానాన్ని నియంత్రిస్తాయని నాడు ప్రధానిగా అటల్ బిహరి వాజ్ పేయి అన్నారు. మండుతున్న మంచులోయకు మళ్లీ వసంతం వస్తుందని, కోయిలలు తిరిగి వస్తాయని, పూలు వికసిస్తాయని ఆకాక్షించారు…వాజ్ పేయి ఆశ కావచ్చు, ఆశయం కావచ్చు…వాటిని నెరవేర్చే దిశగా అన్నట్టుగా నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాము ఎప్పటి నుంచో చెబుతున్న ఆర్టికల్ 370 రద్దు చేశారు. కాశ్మీరీ పండిట్లు తిరిగొస్తున్నారు….టూరిస్టులతో కళకళలాడుతోంది..డీలిమిటేషన్ తర్వాత ఎన్నికలు జరుగుతాయి…జమ్మూకాశ్మీరం మునుపటిలా…