పాన్ ఇండియా సినిమాలకు వరుసగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే సినిమాలను విడుదల చేసిన వాళ్ళు హాయిగా ఊపిరి పీల్చుకుంటుంటే… మరికొన్ని రోజుల్లో విడుదల కావాల్సిన సినిమా మేకర్లను కరోనా, దాని కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రెండూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న కేసుల కారణంగా దేశంలోని రాష్ట్రాలు ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో ఇప్పటికే సినిమాలను పలుమార్లు వాయిదా వేసుకున్న పాన్ ఇండియా సినిమాలకు దెబ్బ మీద దెబ్బ పడినట్టుగా అయ్యింది. తాజాగా తమిళనాడు ప్రభుత్వం…