పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న A2 నిందితుడు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మీదుగా వాహనంలో ఏపీ వైపు పరారవుతున్న రాఘవను చింతలపూడి వద్ద శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వనమా రాఘవ అరెస్టును జిల్లా ఎస్పీ సునీల్ దత్ ధ్రువీకరించారు. రాఘవను ఎస్పీ కార్యాలయంలో విచారించిన అనంతరం శనివారం నాడు కోర్టులో హాజరుపరచనున్నట్టు తెలుస్తోంది. Read…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావును అరెస్ట్ చేసినట్టు వస్తున్న వార్తలను పోలీసులు ఖండించారు. వనమా రాఘవ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని.. అతడి కోసం పోలీసు బృందాలు ఇంకా గాలిస్తూనే ఉన్నాయని పాల్వంచ ఏసీపీ రోహిత్ రాజు తెలిపారు. గురువారం సాయంత్రం వనమా రాఘవను అరెస్ట్ చేసి ఖమ్మం తరలిస్తున్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయని… ఈ వార్తల్లో నిజం లేదని ఏసీపీ…