మునుగోడు ఉప ఎన్నికలో డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఫలితాలపై కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ఓటమికి గల కారణాలు, జరిగిన తప్పులపై చర్చించారు.
లక్ష్మణరేఖ ఎవరు దాటినా చర్యలు తప్పవని కేంద్ర మాజీమంత్రి జైరాం రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకట్.రెడ్డికి నోటీసులు జారీ చేశామన్నారు. సమాధానం రాకపోతే చర్యలుంటాయని అన్నారు.
ఇద్దరు కోటీశ్వరులతో పోటీపడ్డారని, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వయి స్రవంతికి కేంద్ర మాజీమంత్రి జైరాం రమేశ్ కితాబు ఇచ్చారు. కామారెడ్డి జిల్లా జైరాం రమేశ్ మాట్లాడుతూ.. తెలంగాణలో భారత్ జోడోయాత్ర పదకొండు రోజుల పాటు 319 కిలోమీటర్లు, 8 జిల్లాల్లో సాగిందని తెలిపారు. దక్షిణ భారతంలో ఐదు రాష్ట్రాల్లో ఈ యాత్ర పూర్తి చేసుకుని.. ఈరోజు మహారాష్ట్రలోకి చేరుకుంటుందని అన్నారు.