ఆ టీడీపీ సీనియర్‌కి నిన్నటిదాకా పూల కిరీటం అనుకున్న పదవే ఇప్పుడు ముళ్ళ కిరీటంలా మారిపోయిందా? దాని ఎఫెక్ట్‌తో ఆయన కుర్చీలో కూడా సరిగా కూర్చోలేకపోతున్నారా? ఇంట గెలవడం ఆయనకు ఇప్పుడు అత్యవసరం అయిపోయిందా? తప్పించుకుందామనుకున్నా…. వదలకుండా వెంటబడ్డ వ్యవహారం ఆయన్ని పరేషాన్ చేస్తోందా? ఎవరా లీడర్? ఏంటాయన సీటు కిందికొచ్చిన కష్టం? పల్లా శ్రీనివాసరావు….ఏపీ టీడీపీ అధ్యక్షుడు. గాజువాక నుంచి 95వేల మెజారిటీతో గెలిచారాయన. బీసీ కార్డ్, విధేయత కలిసి మంత్రి అయిపోతారనే ప్రచారం జరిగినా….అంతకు మించిన గౌరవం…
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేయడాన్ని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తప్పు పట్టారు. ఆయన్ను అరెస్ట్ చేయడం దుర్మార్గమని చెప్పిన ఆయన, ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే జగన్ ఈ అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారులందరూ వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలన వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కుంటుపడిందని, వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే నారాయణ అరెస్ట్‌కు తెరలేపారని చెప్పారు. అసలు ఏ కేసులో…