ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో రాజకీయంలో పోలీసులు ఇరుక్కుని పోయారు. ఆరు రోజుల క్రితం పోలీసు స్టేషన్ కు తీసుకుని వచ్చిన మాజీ కార్పోరేటర్ ఆచూకీ లేకుండా పోయింది. ఈఘటనపై భార్య ఆందోళన చేస్తే ఆమె పట్ల పోలీసు అధికారులే దురుసుగా ప్రవర్తించారు. తన భర్తను ఏమి చేశారని భార్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఎంఎల్ఎ కందాల ఉపేందర్ రెడ్డి ఆయన అనుచరులు తన భర్త పై కేసు పెట్టించారని జంగం భాస్కర్ భార్య కల్పన ఆరోపిస్తోంది.…