వివాహ వేడుకలో విషాదం చోటు చేసుకుంది. డీజే పాటలకు స్టెప్పులేస్తూ ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం బాసూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన యువతీ, యువకుడికి గురువారం రాత్రి పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా డీజే పాటలకు నృత్యాలు చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న బంగారు నాయుడు(38) డీజే పాటలకు ఎంతో ఉత్సాహంగా స్టెప్పులేశాడు. ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే…
కర్నూలు జిల్లాలో పత్తికొండ మండలం హోసూరులో దారుణ హత్య జరిగింది.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు దారుణంగా హత్య చేశారు గుర్తుతెలియని వ్యక్తులు.. శ్రీనివాసులు వయస్సు 48 ఏళ్లు.. అయితే, తెల్లవారుజామున బహిర్భూమికి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు శ్రీనివాసులు.. ఈ సమయంలో ఆయన కళ్లలో కారం కొట్టి గుర్తు తెలియని దండగులు హత్య చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ సీనియర్ నేతగా ఉన్న నిమ్మక జయకృష్ణ పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.
పిఠాపురంలో పవన్ సమక్షంలో టీడీపీ సీనియర్ నేతలు మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణలు జనసేన పార్టీలో చేరారు. అవనిగడ్డ నుంచి కూటమి అభ్యర్థిగా మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ బరిలోకి దిగడం దాదాపు ఖాయమైపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.