ఆకుకూరలు, పండ్లు ఆరోగ్యానికి చాలామంచివి. కానీ చాలామంది చలికాలంలో ఆకుకూరలు తీసుకుంటే అజీర్ణ సమస్యలు వస్తాయని అపోహపడతారు. చలికాలంలో ఆకుకూరలను తప్పక తీసుకోవాలి అంటున్నారు.వీటిలో ఏ, సీ, కే విటమిన్లు అధికంగా ఉంటాయి. ఆకుకూరల్లో ఫోలిక్ యాసిడ్స్ కూడా కావాల్సినంత ఉంటాయి. రోజూ ఆకుకూరలను తీసుకోవడం ద్వారా శరీరంలో ఎర్ర రక్తకణాలు వృద్ధి అవుతాయి. శ్వాస సంబంధమైన సమస్యలను దూరం చేస్తాయి. చలికాలంలో మహిళలు పాలకూర తినడం చాలా మంచిది. మహిళల సౌందర్యా నికి కూడా పాలకూర…