ఆకుకూరలు, పండ్లు ఆరోగ్యానికి చాలామంచివి. కానీ చాలామంది చలికాలంలో ఆకుకూరలు తీసుకుంటే అజీర్ణ సమస్యలు వస్తాయని అపోహపడతారు. చలికాలంలో ఆకుకూరలను తప్పక తీసుకోవాలి అంటున్నారు.వీటిలో ఏ, సీ, కే విటమిన్లు అధికంగా ఉంటాయి. ఆకుకూరల్లో ఫోలిక్ యాసిడ్స్ కూడా కావాల్సినంత ఉంటాయి. రోజూ ఆకుకూరలను తీసుకోవడం ద్వారా శరీరంలో ఎర్ర రక్తకణాలు వృద్ధి అవుతాయి.
శ్వాస సంబంధమైన సమస్యలను దూరం చేస్తాయి. చలికాలంలో మహిళలు పాలకూర తినడం చాలా మంచిది. మహిళల సౌందర్యా నికి కూడా పాలకూర తోడ్పడుతుంది. ఆకుకూరలకు తోడు క్యారెట్‌ను తీసుకోవడం వల్ల శీతాకాలంలో తరుచూ వచ్చే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందొచ్చు. దగ్గు , జలుబుకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడగలిగే శక్తి ఇందులో ఉంటుంది. ఆలుగడ్డల్లో శరీరానికి అవసరమయ్యే చాలా పోషకాలు ఉంటాయి.
రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సీ, బీ6 వీటిలో ఉంటాయి. అలాగే దానిమ్మను చలికాలంలో తప్పక తీసుకోవాలి. ఇందులో విటమిన్ సీ పుష్కలంగా వుంటుంది. చలికాలంలో దానిమ్మను తీసుకుంటే ఎలాంటి మందులు అవసరం ఉండదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. దానిమ్మ గింజల్ని లేదంటే సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు.
ఇది క్యాన్సర్ కణాలను నివారిస్తుంది. యాంటీ ఆక్సిడెండ్లు ఉండే దానిమ్మను తీసుకోవడం ద్వారా హృద్రోగ సమస్యలు దూరమవుతాయి. కాబట్టి చలికాలంలో జలుబు చేస్తుందని కొన్ని ఆకుకూరలు, పండ్లు తీసుకోకుండా వుండడం మంచిది కాదు.