సక్సెస్, ఫెయిల్యూర్స్ ను బేరీజు వేసుకుంటే… రాశీఖన్నా ఖాతాలో పడిన పరాజయాలే అధికం. అయినా అవకాశాలు అందిపుచ్చుకోవడంలో అమ్మడు భలే జోరును ప్రదర్శిస్తోంది. ఇప్పటికే తెలుగులో ‘పక్కా కమర్షియల్, థ్యాంక్యూ’ మూవీస్ లో నటిస్తున్న రాశీ ఖన్నా ఇతర భాషల్లోనూ నాలుగైదు సినిమాలు చేస్తోంది. అంతేకాదు… బ్యాక్ అటు బ్యాక్ రెండు వెబ్ సీరిస్ లకు పచ్చజెండా ఊపేసిన విషయం తెలిసిందే. ది ఫ్యామిలీ మ్యాన్ -2' తో సమంతను వెబ్ సీరిస్ కు పరిచయం చేసిన ఇద్దరు మిత్రులు రాజ్ అండ్ డీకే... రాశీఖన్నాను అదే తరహాలో డిజిటల్ మీడియాలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఈ రెండు వెబ్ సీరిస్ లలో ఒకదానిలో షాహిద్ కపూర్ నటిస్తుంటే, మరో దానిలో అజయ్ దేవ్ గన్ నటిస్తున్నాడు. అజయ్ నటిస్తున్న 'రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్నెస్' వెబ్ సీరిస్ లో రాశీఖన్నా సైకో కిల్లర్ గా నటించబోతోందని తెలుస్తోంది. అజయ్ దేవ్ గన్ పర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించే ఈ వెబ్ సీరిస్ కు రాజేశ్ ముపుస్కర్ దర్శకుడు కాగా అప్లాజ్ ఎంటర్ టైన్ మెంట్, బీబీసీ స్టూడియోస్ దీనిని సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. బ్రిటీష్ వెబ్ సీరిస్
లూథర్` ఆధారంగా తెరకెక్కుతున్న దీనిని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేస్తారట.