Pakistan Spy: హర్యానా యూట్యూబర్, పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేస్తూ దొరికిన జ్యోతి మల్హోత్రా పట్టుబడటం సంచలనంగా మారింది. ఆమె అరెస్ట్ తర్వాత దేశవ్యాప్తంగా పాకిస్తాన్ గూఢచారులు పట్టుబడుతున్నారు. రాజస్థాన్‌కి చెందిన కాసిం, అతడి సోదరుడు అసిం పాకిస్తాన్ తరపున గూఢచర్యానికి పాల్పడనున్నట్లు ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాసిం పాకిస్తాన్ ఐఎస్ఐ నుంచి శిక్షణ పొందడానికి రెండుసార్లు పాకిస్తాన్ వెళ్లినట్లు అధికారులు తెలిపారు.
Pakistani Spy: భారతదేశానికి సంబంధించిన సున్నిత సమాచారాన్ని దాయాది పాకిస్తాన్‌కు చేరవేస్తున్న వారిని గుర్తించి అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. తాజాగా పాక్‌కు గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలతో రాజస్థాన్‌లో మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.