Pakistan: పాకిస్తాన్ వ్యాప్తంగా వేర్పాటు ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. ఒక్క పంజాబ్ మినహా బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్, ఆక్రమిత కాశ్మీర్, గిల్గిత్ బాల్టిస్తాన్ ఇలా పలు ప్రాంతాల్లో ప్రజలు పాక్ నుంచి స్వతంత్ర దేశంగా ఏర్పాటు కావాలనే డిమాండ్లు ఉన్నాయి. తాజాగా, సింధ్ ప్రావిన్సులో ప్రత్యేక ‘‘సింధుదేశ్’’ను డిమాండ్ చేస్తూ ప్రజలు నిరసలు చేశారు. కరాచీలో పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి.